ఓ తెలంగాణ నర్సు బిడ్డ తెగించి పోరాడితే పోయేది ఏమి లేదు

Friday, 13 May 2016

ఉద్యమాల గడ్డ. ఓ తెలంగాణ బిడ్డ. తెగించి పోరాడితే పోయేది ఏమి లేదు. బానిస బతుకుల సంకెళ్లు తప్ప. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ నర్సులకు న్యాయం జరగలేదు కనీసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నర్సులకు న్యాయం జరుగుతాది అని ఆశ పడ్డాం.

          2011సం౹౹ నుండి ఇంతవరకూ ప్రభుత్వరంగములో నర్సింగ్ జాబుల నియామకాలు చేపట్టలేదు.వేలాది మంది నర్సింగ్ నిరోద్యోగుల ఆశలు అడిఆశాలు అయే. ప్రభుత్వం చేపడుతున్న నర్సింగ్ జాబుల నియమకలలో పురుషులకు అనుమతి లేదు అని అధికారులు నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆయా చదువుకోవడానికి అవకాశం ఇచ్చి. జాబు నియమకలలో అవకాశం లేదు అంటే చదువుకొన్న యువకులు అందరూ ఎక్కడికి వేలాలి. యే వీరు మన తెలంగాణా బిడ్డలూ కాదా??? 

       అయ్యా నర్సింగ్ చదువులు చదుకోవడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 2005 లో పర్మిషన్ ఇస్తే మన అధికారులు 1998 లో జి.ఓ.లను పట్టుకొని యువకులకు ప్రభుత్వ నియమాకలలో అవకాశసం లేదంటే తప్పు ఎవరిదీ?? చదుకొన్నా యువకులదా లేదా జి.ఓ.లను మార్చకుండా పాలిస్తున్న ప్రభుత్వానిదా??? అయ్యా నిన్ననే ఆరోగ్యశాఖ మంత్రివర్యులు వెయ్యి నర్సింగ్ ఖాళీ పోస్టుల నియమాకాలను త్వరలోనే చేపడుతాం అని ప్రకటించారు. అయ్యా నర్సింగ్ చదువులు చదివినా యువకుల సంగతేంది. తెలంగాణా రాష్ట్రంలో దాదాపుగా ఏడూ వేల మంది యువకులు నర్సింగ్ చదువులు ముగించుకొని ఈ రోజు ప్రభుత్వ నియమాకలకోసం ఎదురుచూస్తున్నారు... 

         అయ్యా మేము వినవించేది ఒకటే మాకు న్యాయం చేయండి అని రెండు చేతులు జోడించి వేడుకొంటున్నాము. తెలంగాణ నర్సింగ్ సమితి.
Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 Telangana Nurses
Distributed By Ts Nurses | Design By Telangana Nurses