మన సమాజానికి నర్సుల యొక్క సేవలు అతి ముఖ్యమైనవి!
మన నర్సుల సేవలను వినయోగించుకుంటున్న " సమాజం" మరియు పాలనా " ప్రభుత్వాలు" "మన"" నర్సులకు' సరైన గౌరవము ఇవ్వక పోగా! వారికీ సమాజిక న్యాయం కూడా చేయలేకపోతున్నది. మారుతున్న కలానికి అనుగుణంగా సమాజం లో నర్సులు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారు. వృత్తి పరమైన భద్రత లేకపోవడం చాలి చాలని వేతనలతో దుర్భరమైన స్థితిగతులను అనుభవిస్తున్నారు. మౌళీక సదుపాయలకోసం నర్సులు అందోళన చెందుతున్నారు. భూమిపై అపుడే పుటిన పసి పాప నుండి చని పోవడానికి సిద్ధంగా ఉన్న పండు ముసలి వారికీ సైతం ఒక నర్సు 24 గంట: కన్న తల్లీ తండ్రులకంటే ఎక్కువగా ఆరోగ్యంగా సూసుకొంటారు. యుద్ధరంగములో సైతం దేశం కోసం పోరాడుతున్న సైనికులకు ఆరోగ్య భద్రతను ఇస్తున్నారు. జీకా, ఎబోలా, స్వైన్ ఫ్లు, ఎయిడ్స్ లాంటి వ్యాధులకు సైతం భయపడకుండా రోగులకు సేవలు అందిస్తున్నారు.తను కుటుంబ ప్రేమఅభిమానాలకు దూరమైన, రోగులకు తన జాలి, దయ, ప్రేమ అభిమానం పంచుతున్నారు. కంటి మీద కునుకు పడకుండా రాత్రీపగలూ సేవలు అందిస్తున్నారు. సమయాన్ని నిద్రహారలు లేక శారీరకంగా , మానసికంగా రోగాల బారిన పడిన తాను మాత్రం చిరు నవ్వుతో తన సేవలను అందిస్తుంది.సినీమా రంగం వారు నర్సుల గురించి చాల అసభ్యఒంగా సినిమాలో చూపిస్తున్న, అవి సూసి సమాజం నర్సులను అవహేళనగా చూస్తున్నా మానవత్వం తో అందరి అనారోగ్య పరిస్తులలో నర్సుల సేవలు అందిస్తున్నారు. నర్సులను ఆరోగ్య రంగంలో వెనెముక లాంటి వారుగా భావిస్తారు. మరి ఇటువంటి అతి విలువైన నర్సులకు ఈ సమాజం ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధ్యాన్యత ఏంటి

No comments:
Post a Comment